![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -290 లో.....సుధా కన్నకూతురు గంగ అని వీరుకి తెలిసి గంగ అన్న విషయం ఎవరికి తెలియోద్దని నిషా అనే అమ్మాయిని తీసుకొని వస్తాడు. దాంతో సుధా తనే కన్నకూతురు అనుకొని ఎమోషనల్ అవుతుంది. కానీ గంగే సొంతకూతురన్న విషయం తెలిసిన పైడిరాజు, లక్ష్మి రంగా షాక్ అవుతారు. నువ్వు ఇన్నిరోజులు ఎక్కడున్నావని నిషాని రుద్ర అడుగుతాడు. తను తడబడుతుంటే అప్పుడే వీరు వచ్చి తనని నేనే వెతికి తీసుకొని వచ్చాను.. తను మీ కూతురే అని వీరు చెప్తాడు.
అసలు ఇక్కడ ఏం జరుగుతుందని విశ్వ అంటాడు. అతను నా అన్నయ్య అల్లుడు వీరు అని సుధా చెప్తుంది. అంటే నా భర్త చేతకానివాడు నా కూతురిని వెతుకమని అందరికి చెప్పావా అని సుధాపై విశ్వ కోప్పడతాడు. నువ్వు నా కూతురు కదా.. ఇక నువ్వు నీకు నచ్చినట్టు ఉండు.. నా స్థాయికి తగ్గట్టు ఉండమని నిషాకి విశ్వ చెప్తాడు. ఆ తర్వాత రుద్ర, గంగ, రంగా పైడిరాజు, లక్ష్మి మాట్లాడుకుంటారు. అసలు ఆ అమ్మాయిని చూస్తే నమ్మాలనిపించడం లేదని రుద్ర అనగానే నాక్కూడా అని గంగ అంటుంది. అసలు సుధామ్మ కూతురు నువ్వేనే గంగ అని లక్ష్మి అనగానే అందరు షాక్ అవుతారు.
అంటే నువ్వు సుధామ్మ మీద చూపించిన ప్రేమ, ఆ అమ్మాయి చూపించట్లేదని పిన్ని అంటుందని అని చెప్తూ రంగా కవర్ చేస్తాడు. ఆ తర్వాత గంగ, రుద్ర అక్కడ నుంచి వెళ్తారు. ఎందుకు నిజం చెప్పనివ్వలేదని రంగాని లక్ష్మీ అడుగుతుంది. ఆ అమ్మాయిని పంపించింది ఎవరో కానీ వాళ్ళకి గంగే అసలైన కూతురు అని తెలిసి ఉంటుంది కదా.. ఇప్పుడు మనం నిజం చెప్తే గంగకి వాళ్ళు ఏమైనా ప్రమాదం కలిగించవచ్చు కదా... అది కాకా వాళ్ళు ఎవరో ముందు కనిపెట్టాలని రంగా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |